ETV Bharat / bharat

'చైనా పద్మవ్యూహంలో భారత్.. అమెరికా సాయం అత్యవసరం'

author img

By

Published : Dec 19, 2019, 6:42 AM IST

Updated : Dec 19, 2019, 7:09 AM IST

చైనా నుంచి ముంచుకొస్తున్న ముప్పును తట్టుకుని భారత్ నిలవాలంటే​ రక్షణ రంగాన్ని పటిష్ఠం చేసుకోవాలన్నారు విశ్రాంత మేజర్​ జనరల్​ రమేశ్‌ సి పధి. అందుకు అమెరికా సాయం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. భారత్‌-అమెరికా రక్షణ సంబంధాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బుధవారం ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు. ఈ సందర్భంగా మరిన్ని అంశాలపై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.

In order to get out of china risk, Indian needs US Support says Ramesh C Padhi
'చైనా పద్మవ్యూహంలో భారత్.. అమెరికా సాయం అత్యవసరం'

ప్రస్తుతం భారత్‌ది పద్మవ్యూహంలో అభిమన్యుడి పరిస్థితి అని.. చైనా చుట్టుముడుతోందని విశ్రాంత మేజర్‌ జనరల్‌, మాజీ అదనపు సర్వేయర్‌ జనరల్‌ రమేశ్‌ సి పధి చెప్పారు. అందులోంచి బయటపడాలంటే రక్షణ రంగాన్ని పటిష్ఠం చేసుకోవాలన్నారు. ఆ రంగంలో శాస్త్ర, సాంకేతికతను మరింత అందిపుచ్చుకోవడానికి ప్రస్తుతం కనిపిస్తున్న ఆధారం అమెరికా మాత్రమేనని అభిప్రాయపడ్డారు. చైనాను తట్టుకోవాలంటే అమెరికా సహకారం చాలా అవసరమని.. అలాగని పాత మిత్రుడైన రష్యాతో సంబంధాలను జాగ్రత్తగా కొనసాగించటం కేంద్రానికి సవాలేనని చెప్పారు. భారత్‌-అమెరికా రక్షణ సంబంధాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బుధవారం ఈనాడు ముఖాముఖిలో మాట్లాడారు.

ప్ర. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ తదితర దేశాల్లో చైనా పట్టును పెంచుకునే ప్రయత్నాన్ని మన దేశ రక్షణ విషయంలో ఎలా చూడాలి?

జ. ప్రస్తుతం భారతదేశం పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడి మాదిరిగా ఉంది. భారతదేశాన్ని చైనా శత్రువుగానే భావిస్తోంది. మన చుట్టూ ఉన్న దేశాల్లో వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ఈ పరిణామాలను తక్కువగా అంచనా వేయటం మంచిది కాదు.

ప్ర. అమెరికాతో రక్షణ సంబంధాలు పెరుగుతున్న పరిస్థితుల్లో రష్యాతో సంబంధాల గురించి ఏమంటారు?

జ. రష్యాతో సంబంధాలు చాలా సున్నితమైనవి. రక్షణ రంగంలో మన దేశానికి రష్యా పాత మిత్రుడు. అమెరికా-చైనా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అమెరికా-రష్యా మధ్యా అదే పరిస్థితి. ఈ దశలో రష్యాతో సమతుల్యత పాటించటం మనకు పెద్ద సవాలే. ఇరాన్‌ను కూడా మనం విస్మరించకూడదు.

ప్ర. చైనాను తట్టుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా?

జ. వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. చైనా ఆర్థికంగా అమెరికాను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఆసియాలో భారత్‌కు పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికాతో 2016 నుంచి కీలకమైన ఒప్పందాలను చేసుకుంది.

ప్ర. మునుపటి ఒప్పందాలు ఫలితాన్ని ఇస్తున్నాయా?

జ. నిస్సందేహంగా ఫలితం కనిపిస్తోంది. అమెరికా నుంచి రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోళ్లలో భారతీయ కంపెనీల భాగస్వామ్యాన్ని కేంద్రం అనివార్యం చేసింది. దీంతో చాలా కంపెనీలు మన దేశ సంస్థల భాగస్వామ్యంతో ఇక్కడ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఒప్పందాలతో భవిష్యత్తులో పెద్దస్థాయిలో రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్ర. ఉద్రిక్తతల సమయంలో ఆయుధాలను సరఫరా చేసే దేశాలు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలపై మీరేమంటారు?

జ. నిజమే, ఆ దోపిడీ దారుణంగా ఉంటుంది. అవసరం మనదైనప్పుడు వ్యాపారిది ధోరణి అలాగే ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేమి కూడా ఈ పరిస్థితికి ఓ కారణం. కార్గిల్‌ యుద్ధ సమయంలో అదే జరిగింది. ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటాయి.. కానీ, దేశం కోసం పోరాడుతున్న సైనికులను ఆదుకునేందుకు చేతులు రావు.

ప్ర. మునుపటితో పోలిస్తే సైనికులకు సదుపాయాలు మెరుగయ్యాయని ప్రభుత్వం చెబుతోంది కదా?

జ. వినేవాళ్లు ఉంటే చెప్పే వాళ్లు ఎన్నైనా చెబుతారు. ఇటీవల ‘విజయ్‌ దివస్‌’ జరిగింది. కేంద్రం ఏ మేర పట్టించుకుంది? జరిగిన కార్యక్రమాలు మాజీ ఉద్యోగులు చేసినవే. సైనికుల నుంచి అధికారుల వరకు వైద్య సదుపాయాలు ఎక్కడ?. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి.

ప్ర. రక్షణ రంగ హబ్‌గా హైదరాబాద్‌ మారుతోంది. కొన్ని పరిశ్రమలను కేంద్రం తరలిస్తోందన్న ప్రచారం జరుగుతోంది?

జ. అందులో కేంద్రం పాత్ర కొంత మేరకే. దేశంలో భాజపా ప్రభుత్వం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ ప్రభుత్వమే ఉంది. డిఫెన్స్‌ కారిడార్‌గా ఓ ప్రాంతాన్ని ప్రకటించింది. అక్కడ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ లేదు. హైదరాబాద్‌కు చాలా సంస్థలు వచ్చాయి. తమిళనాడుకూ వస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్రాలు చూపే చొరవే కీలకం. రాయితీలకు పెద్దపీట వేస్తే ఫలితాలు ఉంటాయి.

AP Video Delivery Log - 0000 GMT News
Thursday, 19 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2359: Spain Catalonia Reax AP Clients Only 4245406
Tension in Barcelona amid clashes outside stadium
AP-APTN-2350: US MI Barr Violent Crime Must credit WXYZ; No access Detroit market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4245405
Barr announces crackdown on crime in 7 cities
AP-APTN-2349: UN Mideast AP Clients Only 4245404
UN: Israel housing building 'of serious concern'
AP-APTN-2342: Chile Protest AP Clients Only 4245403
Tear gas used as Chile protests hit 2-month mark
AP-APTN-2328: Brazil Santa Claus AP Clients Only 4245402
Rio children with cancer greeted by jet ski Santa
AP-APTN-2322: US Impeach Schiff Amash Gaetz AP Clients Only 4245401
House nears nighttime impeachment vote
AP-APTN-2318: Brazil Belo Monte Dam AP Clients Only 4245400
Brazil Amazon dam: broken promises for distant power
AP-APTN-2310: US OR Shopping Centre Stabbing KPTV - must credit; no access Portland; no use US broadcast networks; no re-sale, re-use or archive 4245399
One killed, others hurt in Oregon stabbing attack
AP-APTN-2243: Belarus Talks AP Clients Only 4245398
No agreement in talks between Ukraine, separatists
AP-APTN-2242: Egypt France Antiquities AP Clients Only 4245397
Egypt gov, French amb. inaugurate new exhibition
AP-APTN-2226: Syria Idlib Shelling AP Clients Only 4245394
Villages hit in ongoing Idlib countryside shelling
AP-APTN-2227: US Trump Departure AP Clients Only 4245395
Trump heads to rally as House debates impeachment
AP-APTN-2223: Spain Catalonia Clashes 2 AP Clients Only 4245393
Fires in street as Catalan police, protesters clash
AP-APTN-2208: Switzerland UNHCR AP Clients Only 4245392
Grandi closing remarks at global refugee forum
AP-APTN-2202: US Senator Graham AP Clients Only 4245391
Graham urges short trial, promises FISA hearing
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Dec 19, 2019, 7:09 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.