ETV Bharat / state

'ఉజ్జయిని' టూ 'శబరిమల'.. అయ్యప్ప భక్తుడి పాదయాత్ర

author img

By

Published : Dec 16, 2019, 11:56 AM IST

రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఓ అయ్పప్ప భక్తుడు ఉజ్జయిని నుంచి శబరిమలకు పాదయాత్ర చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇప్పటివరకు 3,650 కిలోమీటర్లు నడిచాడు. ప్రస్తుతం కడపలో ఉన్న అతను అయ్యప్ప క్షేత్రానికి పయనమయ్యాడు.

ayyappa devotee foot trip on ujjayini to sabarimala
రవీంద్రారెడ్డి పాదయాత్ర

రవీంద్రారెడ్డి పాదయాత్ర

కడప జిల్లా పులివెందులకు చెందిన రవీంద్రారెడ్డి సెప్టెంబర్ 2న పాదయాత్ర ప్రారంభించారు. తన గురువు సంకల్పం మేరకు ఉజ్జయిని జ్యోతిర్లింగం నుంచి శబరిమలకు యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఉజ్జయిని నుంచి మొదలుపెట్టి.. దారిలోని శక్తి పీఠాలు దర్శించుకుంటూ నేటికి 3,650 కిలోమీటర్లు నడిచారు. ఈనెల 13కి కడప జిల్లా జమ్మలమడుగుకి చేరుకున్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం దర్శించుకుని అక్కడినుంచి కడపకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడినుంచి శబరిమలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి..

ఓ బుల్లి గువ్వా... నీ సవ్వడికై వెతకాలా?

Intro:slug:
AP_CDP_36_15_AYYAPPA_BHAKTUDI_PADAYATRA_PKG_AP10039
contributor: arif, jmd
ఉజ్జయిని నుంచి శబరిమలకు
యాంకర్: ఒక కిలో మీటర్ నడుస్తూనే కాళ్ల నొప్పులతో గంట సేపు సేద తీరుతాం. అలాంటిది ఓ యువకుడు ఏకంగా 3650 కిలోమీటర్లు నడవడం విశేషం .రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఈ మహా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. కడప జిల్లా పులివెందుల రవీంద్రారెడ్డి ఈ సాహసానికి పూనుకున్నారు.
( ) సెప్టెంబర్ 2వ తేదీన కడప జిల్లా పులివెందుల కు చెందిన రవీంద్రారెడ్డి ఉజ్జయిని జ్యోతిర్లింగం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తన గురువు సంకల్పం మేరకు ఈ మహా పాదయాత్రకు పూనుకున్నట్లు ఆయన చెప్పారు. ఆరోజు నుంచి కొన్ని శక్తి పీఠాలు దర్శించుకుంటూ నేటికీ 3650 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్నారు .శుక్రవారం సాయంత్రం కడప జిల్లా జమ్మలమడుగు అయ్యప్ప స్వామి దేవాలయం కి చేరుకున్నారు . ఈ సందర్భంగా జమ్మలమడుగు అయ్యప్ప భక్తులు ఆయనకు స్వాగతం పలికారు. సకాలంలో వర్షాలు కురిసి మంచి మంచి పంటలు పండాలని ఈ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయంలో తన గురువుతో ఇరుముడి కట్టుకుని తిరిగి తన యాత్రను కొనసాగించినట్లు చెప్పారు. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం దర్శించుకుని నేరుగా జమ్మలమడుగు వచ్చానని .... పులివెందులకు వెళ్లి అక్కడి నుంచి శబరిమల కు పాదయాత్ర చేస్తానన్నారు.
బైట్: రవీంద్రారెడ్డి , పాదయాత్ర చేస్తున్న భక్తుడు.. పులివెందుల


Body:AP_CDP_36_15_AYYAPPA_BHAKTUDI_PADAYATRA_PKG_AP10039


Conclusion:AP_CDP_36_15_AYYAPPA_BHAKTUDI_PADAYATRA_PKG_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.