ETV Bharat / state

నిశ్చితార్థం జరుగుతుండగానే... జనసైనికుడి అరెస్టు..!

author img

By

Published : Nov 28, 2019, 5:47 PM IST

వైకాపా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఓ జనసేన కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతని నిశ్చితార్థం జరుగుతున్న సమయంలోనే... స్టేషన్​కు తీసుకెళ్లారు. మరో రెండు రోజుల్లో అతని వివాహం జరగనుంది.

janasena
జససైనికుడు

నిశ్చితార్థం జరుగుతుండగానే... జనసైనికుడి అరెస్టు..!

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి మైలపల్లి రాజు తెలుగుదేశం కార్యకర్త కాగా, కొడుకు సాయిదిలీప్ జనసేన కార్యకర్త. బుధవారం సాయిదిలీప్ నిశ్చితార్థం జరుగుతున్న సమయంలోనే పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా ఎందుకు పోస్టింగ్​లు పెడుతున్నావంటూ ప్రశ్నిస్తే... తనపై ఈ తండ్రికొడుకులు దాడి చేశారంటూ అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టెక్కలి సీఐ ఆర్.నీలయ్య ఈ విషయంపై విచారణ చేపట్టి రాజు, సాయిదిలీప్​ను అరెస్టు చేశారు. వీరిపై ఐటీ యాక్టు 41 కింద కేసులు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు పెట్టారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు ఈ అరెస్టును ఖండించారు. సాయిదిలీప్​కు ఈనెల 30న వివాహం జరగనుంది.

ఇదీ చదవండి

చంద్రబాబు కాన్వాయ్​పై రాజధానిలో రాళ్ల దాడి

Intro:ముఖ్యమంత్రి ఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ లు పెట్టారంటూ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి మైలపల్లి రాజు తెలుగుదేశం కార్యకర్త కాగా, కొడుకు సాయిదిలీప్ జనసేన కార్యకర్త. బుధవారం కుమారుడి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో నే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐటీ యాక్టు 41 కింద కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి పై వ్యతిరేకంగా ఎందుకు పోస్టింగ్ లు పెడుతున్నావంటూ ప్రశ్నించగా, తనపై దాడి చేశారని గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ దురుద్దేశ్యం తోనే అక్రమంగా కేసులు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు అరెస్ట్ లను ఖండించారు. టెక్కలి సీఐ ఆర్.నీలయ్య విచారణ చేపట్టారు. యువకుడి కి ఈనెల 30 న వివాహం జరగనుంది.Body:విక్రమ్Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.