ETV Bharat / state

ఇసుక బాధిత కుటుంబాలకు తెదేపా సహాయ నిధి

author img

By

Published : Nov 14, 2019, 12:29 PM IST

ఇసుక కొరతతో పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు తెదేపా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. కార్మికులకు ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు అందించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇసుక బాధిత కుటుంబాలకు తెదేపా సహాయ నిధి

ఇసుక బాధిత కుటుంబాలకు తెదేపా సహాయ నిధి

ఇసుక కొరతతో చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రకటించారు. దీక్షకు వచ్చి తనకు సంఘీభావం ప్రకటించిన బాధితులను తెదేపా అధినేత పరామర్శించారు. పనుల్లేక కుటుంబాన్ని పోషించలేకే... తమ ఇంటి పెద్దలు ఆత్మహత్య చేసుకున్నారని వారు కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆవేదన వ్యక్తంచేశారు. వారి బాధలు విని చలించిపోయిన చంద్రబాబు... కార్మికులకు ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెంటనే స్పందించిన నేతలు బాధితులకు తమకు తోచిన సాయం చేశారు.

ఇదీ చదవండి:

తెదేపా ఆరోపణలపై వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి దీక్ష

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.