ETV Bharat / state

పోలవరంపై జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్ష

author img

By

Published : Dec 10, 2019, 7:00 AM IST

పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి చేపట్టిన చర్యలపై... జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్షించింది.

Review of National Monitoring Committee on Polavaram
పోలవరంపై జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి చేపట్టిన చర్యలపై... జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్షించింది. పునరావాసం కల్పించకుండానే పోలవరం నిర్మాణం చేస్తున్నారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్​కు పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. జాతీయ మానవ హక్కుల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం కేంద్ర కార్యదర్శి(భూవనరులు) నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో నీతి ఆయోగ్, ఏపీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తదుపరి సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని ఏపీ అధికారులకు కమిటీ సూచించింది. ఒడిశా, ఛత్తీస్​ఘడ్, తెలంగాణల్లోనూ పోలవరం ప్రభావం ఉంటుందని ఆయా రాష్ట్రాలను కూడా సమావేశానికి పిలవాలని పెంటపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'ఆ షరతులకు లోబడి ఉంటేనే... పోలవరానికి నిధులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.