ETV Bharat / state

పనుల్లేక.... భార్యబిడ్డలను పోషించుకోలేక చచ్చిపోతున్నా...

author img

By

Published : Oct 28, 2019, 2:52 PM IST

Updated : Oct 28, 2019, 7:41 PM IST

ఊరు ఊరంతా దీపావళి రంగులతో కళకళలాడిపోతుంది... టపాసులు చిమ్మే వెలుగులతో ధగధగా మెరిసిపోతుంది. , బాంబుల మోతలతో హోరెత్తిపోతోంది. అందరూ సంతోషంగా గడుపుతున్నారు... అదే ప్రాంతంలో... భార్యాబిడ్డలను పోషించలేకపోతున్నాను... కుటుంబాన్ని ఆనందంగా ఉంచలేకపోతున్నా... అసమర్థతతో దీపావళి రోజున వారి జీవితాలు చీకటి చేస్తున్నా... అంటూ ఓ సామాన్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పడే మనోవేదన రికార్డు చేసిన వీడియో ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది. 20 రోజుల క్రితం జరిగిన ఈ విషాదం.. సెల్ఫీ వీడియో బయటపడిన కారణంగా వెలుగులోకొచ్చింది.

పని లేక ప్లంబర్​ ఆత్మహత్య

వెంకటేశ్వర్లు గుంటూరులో ప్లంబర్​గా పని చేస్తున్నాడు... పనికి వెళ్తేగాని ఐదువేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితి. అలాంటి వెంకటేశ్వర్లు జీవితంలో ఇసుక కొరత... చీకట్లు నింపింది. చేయడానికి పనుల్లేక, చేతిలో రూపాయిలేక, బిడ్డలను ఎలా పెంచాలో తెలియక నరక యాతన పడ్డాడు. ఆఖరికి ఏమి చేయాలో తెలియక చావే శరణ్యమనుకున్నాడు... అతని బాధను వీడియోలో చెప్పి... తనువు చాలించాడు. 20 రోజుల క్రితం జరిగిన ఈ విషాదం.. సెల్ఫీ వీడియో బయటపడిన కారణంగా వెలుగులోకొచ్చింది.


" నేనొక అసమర్థుణ్ని... పెళ్లాం పిల్లలను పెంచుకోలేకపోతున్నా. మిమ్మల్ని ఆనందంగా చూసుకోవాల్సిన నేనే చచ్చిపోతున్నాను... నాకెంతో సిగ్గుగా ఉంది. అత్తయ్య, మావయ్య నన్ను క్షమించండి. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. పనిలేకే నేను చచ్చిపోతున్నా. అందరూ పనికెళ్తున్నావా..? అంటే వెళ్తున్నా అని చెప్తున్నాను గానీ ఎక్కడున్నాయి పనులు.. లేవు. అన్నయ్య వదినా.. ఛాయగాన్ని జాగ్రత్తగా చూసుకోండి... రాశి...నన్ను ఛాయగాణ్ని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకో'- ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వర్లు ఆవేదన


గుంటూరులో ప్లంబర్​ ఆత్మహత్య

చేయడానికి పనిలేక... భార్యాబిడ్డలను పెంచుకోలేక వారినే క్షమాపణ అడిగి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. భవిష్యత్తులో భార్య పరిస్థితి ఏమైతుందో అర్థంకాక... రెండో పెళ్లి చేసుకోమని సెలవంటూ వెళ్లిపోయాడు.

ఇదీ చదవండి ఇసుక కొరత... మరో కార్మికుడి ప్రాణం తీసింది

sample description
Last Updated : Oct 28, 2019, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.