ETV Bharat / state

మీరు పనిచేస్తేనే ప్రభుత్వ కలల నిజమవుతాయి: సీఎం జగన్

author img

By

Published : Feb 6, 2020, 12:02 AM IST

సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారుల ఇంటికి చేర్చడం, సమస్యలను సత్వరంగా పరిష్కరించడమే లక్ష్యంగా... సమర్థంగా పనిచేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాలు సమర్థంగా పనిచేసేలా చూడాలన్నారు. సచివాలయ వ్యవస్థల పనితీరుపై ఆయా శాఖల కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.

Cm jagan Review On Villag  Ward Secratariat
ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి జగన్

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సహా వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్న సీఎం... రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు అందాలంటే... గ్రామసచివాలయాలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తేనే ప్రభుత్వ కలలు నిజం అవుతాయని చెప్పారు. అప్పుడే ప్రజా సంతృప్త స్థాయిలో కార్యక్రమాలు, పథకాలు అమలవుతాయని సీఎం అన్నారు. రైతు భరోసా కేంద్రాలు వచ్చేంత వరకూ ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగులు గ్రామ సచివాలయాల్లో ఉండాలని చెప్పారు.

నిరంతర పర్యవేక్షణ ఉండాలి...

గ్రామ, వార్డు సచివాలయాల్లో అందిస్తున్న 541 సేవలను నిర్దేశిత కాలంలోగా అందిస్తామని చెప్పినందున.. ఏ సేవలు ఎప్పటిలోగా అందుతాయో గ్రామ సచివాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల నుంచి వచ్చే విజ్ఞాపనలు, దరఖాస్తులకు ప్రతి శాఖ కార్యదర్శి ప్రాధాన్యత ఇవ్వాలని... నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రతి శాఖలోనూ ప్రతి విభాగంలోనూ ఒక వ్యక్తిని ఈ పర్యవేక్షణ కోసం పెట్టాలని సీఎం ఆదేశించారు. నేరుగా సీఎం కార్యాలయం కూడా పర్యవేక్షింస్తుందని తెలిపారు.

సచివాలయాల్లో రోజూ స్పందన కార్యక్రమం...

రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రారంభించబోయే పథకాలకు సంబంధించిన వివరాలతో పోస్టర్లను రూపొందించి గ్రామ సచివాలయాల్లో అతికించాలని సీఎం ఆదేశించారు. రేషన్‌కార్డులు, పెన్షన్లు తదితర లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని సీఎం అన్నారు. గ్రామ సచివాలయాల్లో ప్రతి రోజూ కూడా స్పందన కార్యక్రమం జరుపుతున్నట్లు సీఎం ఆదేశించారు. ప్రజలనుంచి దరఖాస్తులు, విజ్ఞాపన పత్రాలను ప్రతిరోజూ తీసుకుంటామన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు నిరంతరం శిక్షణ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. పీరియాడికల్‌ ఇండికేటర్స్‌ ఉండాలని... ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ చెకింగ్‌ ఉండాలని.... వాలంటీర్లకూ అటెండెన్స్‌ విధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

పథకాల్లో ఎక్కడా అవినీతి ఉండకూడదు...

ఎవరైనా అవినీతికి పాల్పడితే ఫిర్యాదు చేసే విధానం, వెంటనే చర్యలు తీసుకునే విధానాలు ఉండాలన్నారు. థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ బలోపేతంగా ఉండాలని... గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై నెలకోసారి సమీక్షా సమావేశం నిర్వహించాలని సీఎం నిర్దేశించారు.

ఇవీ చదవండి:

'కేంద్రం మెడలు వంచుతామన్నారు... ఇప్పుడు మాట్లాడరెందుకు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.