ETV Bharat / state

చిలకలూరిపేటలో కరోనా కలకలం... ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు..!

author img

By

Published : Jan 28, 2020, 11:53 PM IST

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది కరోనా వైరస్. చైనాలో జీవం పోసుకున్న ఈ ప్రాణాంతక వైరస్... వివిధ దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో చిలుకలూరిపేటలో ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

carona virus
carona virus

carona virus
నాదెళ్ల వెంకటసుబ్బయ్యతో వైద్యాధికారి గోపీనాయక్

కరోనా వైరస్​ అలజడి నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతను ఇటీవలే చైనా పర్యటనకు వెళ్లి వచ్చారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. చిలకలూరిపేటకు చెందిన నాదెళ్ల వెంకటసుబ్బయ్య, తన మిత్రులు సురేష్​కుమార్(విజయవాడ), గోపాలకృష్ణ, వాసుదేవరావు (గుంటూరు), నరేంద్ర (హైదరాబాద్)లతో కలసి ఈ నెల 9వ తేదీన చైనాకు విహారయాత్రకు వెళ్లారు.

ఆ దేశంలోని నాన్​ట్యాంగ్​లో వీరందరూ... మరో మిత్రుడు శ్రీధర్​రెడ్డిని కలిశారు. అతని సహకారంతో చైనాలోని బీజింగ్, షాంగై, నాన్​ట్యాంగ్, మిచాంగ్ నగరాల్లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం ఈ నెల 19న భారత్​కు చేరుకున్నారు. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిలకలూరిపేటలో ఉన్న వెంకట సుబ్బయ్యను వైద్యాధికారి గోపీనాయక్ మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి విచారించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. వెంకటసుబ్బయ్యకు వ్యాధి లక్షణాలు లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు.

ఇదీ చదవండి:'కరోనా'​కు మందు కనుగొన్న తమిళ వైద్యుడు!

Intro:కరోనా వైరస్ ఈ నేపథ్యంలో చైనా వెళ్లి వచ్చిన వారిని వైద్యులు విచారిస్తున్నారు అందులో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట కు చెందిన నాదెళ్ల వెంకటసుబ్బయ్య మంగళవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యాధికారి డాక్టర్ గోపీనాయక్ విచారించారుBody:కరోనా వైరస్ నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇటీవల చైనా వెళ్లి వచ్చిన వ్యక్తిని వైద్యులు మంగళవారం విచారించారు.. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. చిలకలూరి పేట కు చెందిన నాదెళ్ల వెంకటసుబ్బయ్య తన మిత్రులు మరో నలుగురు సురేష్ కుమార్( విజయవాడ )గోపాలకృష్ణ వాసుదేవరావు( గుంటూరు) నరేంద్ర (హైదరాబాద్) లతో కలసి ఈ నెల 9వ తేదీన చైనాలో విహార యాత్రకు వెళ్లారు... చైనా దేశంలోని నాన్ ట్యాంగులో ఐదుగురు కు సంబంధించి ఉన్న మిత్రుడు శ్రీధర్ రెడ్డిని కలిశారు ...అతని సహకారంతో చైనాలోని బీజింగ్, షాంగై, నాన్ ట్యాంగ్ ,మి చాంగ్ నగరాలలోని పర్యాటక ప్రదేశాలను చూశారు.. అనంతరం ఈ నెల 19న ఇండియా కు చేరుకున్నారు.. ప్రస్తుతం చైనాలో కనుగొన్న కరోనా వైరస్ ఆందోళన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిలకలూరిపేట లో ఉన్న వెంకట సుబ్బయ్య ను వైద్యాధికారి గోపీనాయక్ మంగళవారం ఇంటికి వెళ్లి విచారించారు... వైద్య పరీక్షలు నిర్వహించారు ...ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు.

ఫోటో రైట్ అప్: వెంకట సుబ్బయ్య ను విచారిస్తున్న వైద్యుడు డాక్టర్ గోపీనాయక్Conclusion:మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.