ETV Bharat / state

అడవి జంతువుల నుంచి రక్షణగా పొలం చుట్టూ చీరలు

author img

By

Published : Oct 24, 2019, 7:01 PM IST

అనంతపురం జిల్లా పాలవాయి గ్రామ సమీపంలో... వన్యప్రాణుల నుంచి తన పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్నంగా అలోచించాడు. తన పొలం పక్కనే కొండ ఉండడం వల్ల జంతువులు పొలంలోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని... వాటి నుంచి తన పొలాలను కాపాడుకునేందుకు చీరలను ఆసరాగా చేసుకున్నాడు.

పొలం చుట్టూ చీరలను కట్టిన రైతు

పొలం చుట్టూ చీరలను కట్టిన రైతు

అనంతపురం జిల్లా పాలవాయి గ్రామ సమీపంలో గంగన్న అనే రైతు వన్యప్రాణుల నుంచి పంటను కాపాడుకోవడానికి వినూత్నంగా అలోచించి తన పొలం చుట్టూ రంగు రంగుల చీరలు కట్టాడు. తమ పొలం పక్కనే కొండ ఉందని.. అక్కడి నుంచి ఎలుగుబంట్లు, అడవి పందులు మూకుమ్మడిగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చీరలు కట్టడం వల్ల కొంతైనా అడవి జంతువుల బాధ తప్పుతుందని చెబుతున్నాడు.

ఇదీ చదవండి: ఈ రహదారిపై ప్రయాణం... ప్రమాదాలకు ఆస్కారం...!

Intro:ap_atp_61_24_saree_gourd_for_crop_avb_ap10005
~~~~~~~~~~~~~~*
ఈ పంటకు చీరలే శ్రీరామరక్ష...
-----------*
రైతులు పంటల్ని కాపాడుకోడానికి కాపలా ఉండటం, కంచె వేసుకోవడం చూశాం.... అయితే ఇక్కడ కనిపిస్తున్న చీరలే తమ పంటకు శ్రీరామరక్ష అంటున్నారు ఈ అన్నదాతలు... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామ సమీపంలో ఓ రైతు వన్యప్రాణుల నుంచి తన పంటను కాపాడుకోవడానికి పొలం చుట్టూ రంగు రంగుల చీరలు కట్టాడు. తమ పొలం పక్కనే కొండ ఉందని ఆ కొండమీద నుంచి ఎలుగుబంట్లు, అడవి పందులు విపరీతంగా వచ్చి తన కర్బూజ పండ్లు. ఇతర పంటలను తినేస్తూ ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చీరలు కట్టుకోవడం వల్ల కొంత అయినా అడవి జంతువులు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని భావించి ఇలా అడ్డుగా కంచె లాగా కట్టానని గంగన్న అనే రైతు తెలుపుతున్నాడు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.