ETV Bharat / state

చదివింది తొమ్మిది.. అద్భుత ఆవిష్కరణలు ఈ రైతు సొంతం

author img

By

Published : Nov 27, 2019, 10:34 AM IST

చదివింది తొమ్మిది వరకే అయినా పెద్ద పెద్ద కంపెనీలకు పోటీనిచ్చే ఆవిష్కరణలు అతని సొంతం. వ్యవసాయం చేయాలనే కోరికతో కోరి వచ్చిన ఉద్యోగాన్ని వదిలేశాడు. సాగు రైతులకు తన ఆవిష్కరణలతో సహాయం చేస్తూ.. గ్రామస్థులు చేత శభాష్​ అనిపించుకుంటున్నాడు. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే అన్నదాతలకు అవసరమైన మరెన్నింటినో ఆవిష్కరిస్తానంటోన్న అనంత రైతు హజీ భాషాపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..!

new tractor invented by anatapuram farmer
చదువు తొమ్మిది ఆవిష్కరణలు పెద్దవి

చదువు తొమ్మిది ఆవిష్కరణలు పెద్దవి

అనంతపురం జిల్లా పెద్దయక్కలూరుకు చెందిన హాజీ బాషా చదివింది తొమ్మిదో తరగతి. అయితేనేం అతను చేసిన ఆవిష్కరణలు సైతం పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆశ్చర్యపోయాయి. వందల అడుగుల్లో ఉన్న మోటార్లను సులువుగా బయటకు తీసే యంత్రాన్ని కనిపెట్టాడు. ఇతని ప్రతిభను గుర్తించిన ఓ సంస్థ మంచి జీతంతో ఉద్యోగం ఇచ్చింది. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. రైతులకు ఉపయోగపడేలా పరికరాల తయారీలో నిమగ్నమయ్యాడు.

డీజిల్​ ఇంజిన్​ ట్రాక్టర్​ తయారీ

తనకు ట్రాక్టర్​ కొనే స్తోమత లేనందున తానే సొంతంగా డీజిల్​ ఇంజిన్​ ట్రాక్టర్​ తయారు చేశాడు. 5 హెచ్.పీ డీజిల్ ఇంజిన్​కు కమాండర్ జీపు గేరు బాక్స్, పొక్లెయిన్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ పరికరాలను వినియోగించి గంటకు 40 కి.మీ వెళ్లే ట్రాక్టర్​ను రూపొందించాడు. అర లీటర్ డీజిల్​తో గంట సమయం నడిచేలా ట్రాక్టర్ తీర్చిదిద్దాడు. అంతేకాకుండా ఈ ట్రాక్టర్​తో దుక్కి దున్నడానికి, తెగుళ్ల నివారణక క్రిమిసంహారక మందు పిచికారి చేసేందుకు అవసరమైన పరికరాలను సైతం సొంతంగా తయారు చేసుకున్నాడు. ఆధునిక పద్ధతి ద్వారా వ్యవసాయం చేసేందుకు పరికరాలు తయారు చేయాలని ప్రయత్నించి మొదటి విఫలమైనా... పట్టు వదలకుండా ప్రయత్నించి విజయం సాధించాడు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే రూ.1.50 లక్షలతో ఇంతకు మించి నాణ్యమైన యంత్రాలను తయారుచేసి ఇస్తానని అంటున్నాడు ఈ రైతు. ప్రస్తుతం తన మూడు ఎకరాల పొలంలో రేగు పంటను వేసి.. తన సొంత పరికరాలు వినియోగిస్తూ సాగు చేస్తున్నాడు.

ఇదీ చదవండి:

'ఊరు చాలా ఇచ్చింది... ఎంతో కొంత తిరిగిచ్చేయాలి'

Intro:తొమ్మిదో తరగతికే చదువు ముగించిన ఓ యువకుడు.. కొన్నేళ్ల పాటూ మోటార్ రివైండింగ్ పనులు నేర్చుకుంటూ జీవనం సాగించాడు.. ఆ సమయంలో వందల అడుగులో ఉన్న మోటార్లను సులువుగా బయటకు తెసేలా తన మదిలో మెలిగిన ఓ ఆలోచనతో ఓ యంత్రాన్ని తయారు చేసాడు. అతని ప్రతిభను గమంచిన ఓ ప్రయివేటు కంపెనీ మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని ఇచ్చింది. ఆ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేదు. తన మూడెకరాల పొలంలో వ్యవసాయం చేయాలనుకున్నాడు.. వ్యవసాయం కోసం ఎద్దులను వినియోగించాలి అంటే పశుగ్రాసం కొనరత వేధించింది.. ట్రాక్టర్ కొనే స్తోమత లేదు.. ఆధునిక పద్ధత ద్వారా వ్యవసాయం చేసేందుకు తానే పరికరాలు తయారు చేసేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు.. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి డీజిల్ ఇంజన్ ట్రాక్టర్ తయారుచేసే పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లా పెద్దపప్పురు మండలం పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన యువకుడు హాజీభాష..

అనంతపురం జిల్లా పెద్దపప్పురు మండలం పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన హాజ బాషా 5 హెచ్.పీ డీజిల్ ఇంజిన్ కు కమాండర్ జీపు గేరు బాక్స్, పొక్లెయిన్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ పరికరాలను వినియోగించి గంటకు 40 కి.మీ వెళ్లే ట్రాక్టర్ ను సొంతంగా రూపొందించాడు. అర లీటర్ డీజిల్ తో గంట సమయం నడిచేలా ట్రాక్టర్ తీర్చిదిద్దాడు. అంతేకాకుండా ఈ ట్రాక్టర్ తో దుక్కి దున్నడానికి, తెగుళ్ల నివారణక క్రిమిసంహారక మందు పిచికారి చేసేందుకు అవసరమైన పరికరాలను సొంతంగా తయారు చేసుకున్నాడు. ట్రాక్టర్, ట్రాలీతో పాటు ఇతర ఉపకరణాలకు రూ.లక్ష ఖర్చయింది. ప్రభుత్వం సహకరించి ప్రోత్సాహం అందిస్తే రూ.1.50 లక్షలతో ఇంతకుమించి నాణ్యమైన యంత్రాలను తయారుచేసి ఇస్తానని అంటున్నాడు. ప్రస్తుతం తన మూడు ఎకరాల పొలంలో రేగు పంటను తన సొంత పరికరాలు వినియోగిస్తూ సాగు చేస్తున్నాడు..


Body:హజీబాషా (పెద్దయక్కలూరు గ్రామ రైతు)


Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.