ETV Bharat / international

‘భారత్‌- అమెరికా మైత్రి వేగంగా బలపడుతోంది’

author img

By

Published : Dec 7, 2019, 1:20 PM IST

భారత్​-అమెరికా మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధంలో మెరుగైన వృద్ధి నమోదవుతోందని అగ్రరాజ్యంలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల్లో సమతుల్యత పెరిగిందన్నారు.

economic growth
‘భారత్‌-అమెరికా మైత్రి వేగంగా బలపడుతోంది’

భారత్‌-అగ్రరాజ్యం మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధం వేగంగా వృద్ధి చెందుతోందని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. భారత వృద్ధిలో అమెరికా సహజ భాగస్వామిగా మారిపోయిందన్నారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితం సున్నాగా ఉన్న రక్షణ ఉత్తత్తుల కొనుగోలు బంధం నేడు 20బిలియన్ డాలర్లకు చేరిందని వెల్లడించారు. దీంతో అమెరికాకి భారత్‌ ప్రధాన రక్షణ భాగస్వామిగా మారిపోయిందన్నారు. ఇందులో భాగంగా అనేక సైనిక విన్యాసాలు, ఒప్పందాలు జరిగాయన్నారు.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ఇక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఏడాదికి 10శాతం చొప్పున వృద్ధి చెందుతోందన్నారు. 2018 నాటికి ఇది 142 బిలియన్‌ డాలర్లకు చేరిందన్నారు. అలాగే ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాల్లో సమతుల్యత కూడా పెరిగిందన్నారు. అలాగే పెట్టుబడుల విషయంలోనూ ఉభయ దేశాలు మెరుగైన స్థాయికి చేరాయన్నారు. అమెరికాకి చెందిన 2000 కంపెనీలు భారత్‌లో వివిధ రంగాల్లో 40 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయన్నారు.

అదే సమయంలో భారత్‌కు చెందిన 200 కంపెనీలు యూఎస్‌ 18బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయన్నారు. దీంతో అక్కడ లక్ష మందికి ఉపాధి కలిగిందని పేర్కొన్నారు. ఇంధన, హెల్త్‌కేర్‌ టెక్నాలజీలోనూ గతకొన్నేళ్లలో ఇరు దేశాల మధ్య సహకారం పెరిగిందన్నారు. ఉభయ దేశాల్లో పలు సంస్థలు భాగస్వామ్యంగా ఏర్పడి అనేక వ్యాధులపై సుదీర్ఘకాలంగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయన్నారు. టీకాల తయారీ, క్షయ నివారణ చికిత్స వంటి అంశాల్లో కృషి జరుగుతోందన్నారు.

ఇదీ చూడండి : 'చైనా దగ్గర చాలా ఉంది.. మళ్లీ అప్పు ఇవ్వడం ఎందుకు?'

New Delhi, Dec 06 (ANI): Congress Members of Parliament staged walkout in Lok Sabha over protest against Unnao incident, where a rape survivor was set ablaze on her way to court. Congress leader Adhir Ranjan Chowdhury expressed anguish over the crimes against women and asserted that on one hand lord Ram temple is being built and on the other 'Sita Maiya' is being set ablaze. Speaking at the session, Adhir Ranjan Chowdhury said, "The Unnao victim has 95% burns, what is going on in the country? On one hand there is a lord Ram temple being built and on the other hand 'Sita Maiya' is being set ablaze. How are criminals feeling so emboldened?"

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.