ETV Bharat / city

'చంద్రబాబుకు పేరు వస్తుందనే.. జగన్​ కక్ష'

author img

By

Published : Sep 6, 2019, 12:32 PM IST

పోలవరం పనులు మరింత ఆలస్యం అవుతాయని అందరూ చెబుతున్న జగన్ మూర్ఖత్వంతో ముందుకు వెళుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థను కాపాడతానన్న జగన్.. కక్షతో వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం పూర్తైతే చంద్రబాబుకు పేరు వస్తుందనే భయం జగన్​లో కనిపిస్తుందన్నారు.

చంద్రబాబుపై కక్ష... పోలవరంపై జగన్ మూర్ఖత్వం:దేవినేని ఉమ

చంద్రబాబుపై కక్ష... పోలవరంపై జగన్ మూర్ఖత్వం:దేవినేని ఉమ

రాజ్యాంగ వ్యవస్థను కాపాడతానన్న జగన్ కక్షతో వ్యవహరిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. పోలవరం పనులు ఆపడం, రైతులకు అన్యాయం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గడ్కరీ అనుమతితో గత తెదేపా ప్రభుత్వం నవయుగ ద్వారా పోలవరం పనులు 70శాతం పూర్తి చేసిందని... సౌలభ్యం కోసం పెట్టుకున్న క్లాజును అడ్డం పెట్టుకుని పనులు నిలిపివేశారని ఆయన అన్నారు. కోర్టు సైతం ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని... అయినా న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

చంద్రబాబుపై కక్షతోనే...
పోలవరం విషయంలో చంద్రబాబు పేరు ఎక్కడా కనిపించకూడదనే అక్కసు జగన్​లో కనిపిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం నుంచి ఉన్న‌ వెంకటేశ్వరరావును తొలగించడం అన్యాయమని దేవినేని విచారం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ చీఫ్ హోదాలో నలుగురు సీఎంల వద్ద ఆయన పని చేశారని... కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చిన అధికారిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. నలుగురు ముఖ్యమంత్రులకు మంచి అధికారిగా ఉన్న వెంకటేశ్వరరావును ఏకారణంతో తప్పించారని సీఎం జగన్​ను దేవినేని ఉమ ప్రశ్నించారు.

ఇవీ చూడండి-పోర్టల్​లో పోలవరం టెండర్ వివరాలు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_06_death_p v raju_text_AP10025 తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పంపా రిజర్వాయర్ లో మహిళ మృత దేహం లభ్యమైంది. రెండ్రోజుల క్రితమే ఈమె నదిలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతురాలు ది తొండంగి గ్రామానికి చెందిన అరుణ గా పోలీసులు గుర్తించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది హత్య అని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ వ్యక్తి హత్య చేసి రిజర్వాయర్ లో తోసి ఉంటాడని అంటున్నారు. ఆయా అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.