ETV Bharat / city

రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతారా?: చంద్రబాబు

author img

By

Published : Jul 25, 2019, 7:36 PM IST

జగన్‌, కేసీఆర్​ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ వైఖరిని గతంలో విమర్శించిన జగన్‌... ఇవాళ కేసీఆర్‌ను పొగుడుతున్నారని విమర్శించారు.

తెదేపా అధినేత చంద్రబాబు

నీరు-చెట్టు గొప్ప కార్యక్రమం...

వైకాపా ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు చర్చకు రాకుండా చేస్తున్నారన్న చంద్రబాబు... దేశంలోనే నీరు - చెట్టు గొప్ప కార్యక్రమమని చెప్పారు. నీరు - చెట్టు కార్యక్రమాన్ని కేంద్రం గతంలో ప్రశంసించిన విషయం గుర్తుచేశారు. ప్రజావేదిక కట్టేందుకు 8 నెలలు పట్టిందన్న చంద్రబాబు... కొన్ని గంటల్లోనే కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు

వైకాపా బెదిరింపులకు ఎవరూ భయపడరు...

అసెంబ్లీ అనేది ప్రజాసమస్యలను చర్చించే వేదికని... సీఎం జగన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాతనం పెంచుకోవాలని హితవు పలికారు. జగన్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. వైకాపా బెదిరింపులకు ఎవరూ భయపడరని ఉద్ఘాటించారు. తాము మాట్లాడేసరికి మైక్ ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తెదేపా సభ్యులు గట్టిగా పోరాడారని చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌, జగన్‌ అధికారం శాశ్వతం కాదు...

కేసీఆర్‌, జగన్‌ కు అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. నదీజలాలపై రైతులు, యువత, ఇంజినీర్లు చర్చించాలన్న చంద్రబాబు... ఇది రెండురాష్ట్రాల ప్రజల సమస్య అని చెప్పారు. నదీజలాలు అనేవి రాష్ట్ర హక్కులకు సంబంధించిన విషయమని... మన నీళ్లు మనం వాడుకుందాం, వాళ్ల నీళ్లు వాళ్లను వాడుకోనివ్వండని ప్రభుత్వానికి సూచించారు. బొల్లాపల్లి ప్రాజెక్టు పూర్తయితే గ్రావిటీ ద్వారా సాగర్‌కు నీళ్లు వెళ్తాయని వివరించారు.

అభివృద్ధిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు...

వంశధార ప్రాజెక్టుపై అధికార పార్టీ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామన్న చంద్రబాబు... గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతిలో మునిగిన వ్యక్తి ఇప్పుడు నీతి, నిజాయతీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నదీజలాలపై గతంలో జగన్‌ మాట్లాడిన మాటలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇదీ చదవండి...

గవర్నర్ బిశ్వభూషణ్‌తో చంద్రబాబు భేటీ

Intro:AP_GNT_71_23_MRUTADEHALANU_PARISEELINCHINA_COLLECTOR_AV_AP10115


Body:గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి వద్ద mla, mlc క్వారటర్లలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ముగ్గురూ బీహార్ రాష్టానికి చెందిన ఆపరేటర్లు సోమవారం మృతి చెందారూ. అమరావతి ప్రభుత్వ ఆసుపత్రి శవగారంలో ఉంచిన మృత దేహాలను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ మంగళవారం ఉదయం పరిశీలించారు. మృతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను నిర్మాణ సంస్ద ప్రతినిధులని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరుపున సహాయం అందించేందును ప్రతిపాదనలు Y తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతదేహాలను వెంటనే వారి స్వస్తలాలకు పంపేలా చూడాలని అధికారులను ఆదేశించారు..


Conclusion:AP_GNT_71_23_MRUTADEHALANU_PARISEELINCHINA_COLLECTOR_AV_AP10115
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.