ETV Bharat / city

''మీడియాతో సంబంధం ఉన్న ముఖ్యమంత్రే నియంత్రిస్తే ఎలా?''

author img

By

Published : Nov 7, 2019, 8:22 AM IST

Updated : Nov 7, 2019, 8:48 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 పై.. ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు అనంత్‌ బగేత్కర్‌ విస్మయం వ్యక్తం చేశారు. మీడియాతో సంబంధం ఉన్న ముఖ్యమంత్రే నియంత్రిస్తే ఎలా.. అని ప్రశ్నించారు.

AnanthBagetkar

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలతో సంబంధం ఉన్న ముఖ్యమంత్రే మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేయడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, సీనియర్‌ పాత్రికేయులు అనంత్‌ బగేత్కర్‌ పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మీడియా చేసే విమర్శలను సానుకూలంగా తీసుకోవాల్సింది పోయి అసహనం ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని.. ఏపీ ప్రభుత్వం మీడియాకు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ‘ఈనాడు- ఈటీవీ’తో మాట్లాడారు.

‘‘పాత్రికేయులను కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430 రాజ్యాంగంతోపాటు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఉంది. పాత్రికేయులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు ఏకపక్షంగా అధికారాలు అప్పగించడం ఆందోళనకరం. పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయా? పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయా? అన్నది చూసి పాత్రికేయులపై కేసులు పెట్టే అధికారం కార్యదర్శిస్థాయి అధికారులకు ఇచ్చారు. ఇది భావప్రకటన స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు పూర్తి విరుద్ధం. ఈ పద్ధతి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుంది.ఎక్కడైనా స్వేచ్ఛాయుతమైన మీడియా ఉండాలి. ప్రభుత్వాలపై మీడియా చేసే విమర్శలను సానుకూలంగా తీసుకోవాలని జాతి నిర్మాతలు మనకు నేర్పారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై మీడియా విమర్శలు చేసినప్పుడు అందులోని స్ఫూర్తిని గ్రహించే సంప్రదాయాన్ని స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్నాం. మీడియా చేసే విమర్శల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉలికిపాటుతో స్పందించే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు తీసుకొనే విధానాలు, నిర్ణయాల్లోని లోటుపాట్లను మీడియా తప్పనిసరిగా విమర్శిస్తుంటుంది. అందులో ప్రజాప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవు. ప్రభుత్వ చర్యలు ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వాటిని ఎలుగెత్తడం మీడియా బాధ్యత. ఇలాంటి విమర్శలపట్ల ప్రభుత్వ పెద్దలు అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. ఇకముందు మరింత విజ్ఞతతో వ్యవహరించాలి’’ అని అనంత్‌ బగేత్కర్‌ పేర్కొన్నారు.

Intro:Body:

Conclusion:
Last Updated :Nov 7, 2019, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.