ETV Bharat / city

'నాలుగు నెలల్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలి'

author img

By

Published : Oct 31, 2019, 8:59 AM IST

Updated : Oct 31, 2019, 11:28 AM IST

రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్​ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు న్యాయమూర్తులతో కలిసి తీర్పు వెలువరించగా మరో నాలుగు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

నాలుగు నెలల్లో రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్​ని ఏర్పాటు చేాయాలంటూ హైకోర్టు ఆదేశం

మానవ హక్కుల కమిషన్​ ఏర్పాటుకు నాలుగు నెలల గడువు ఇచ్చిన ధర్మాసనం

రాష్ట్రంలో నాలుగు నెలల్లో మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే.కె. మహేశ్వరి, జస్టిస్ విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మోహనరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత నాలుగేళ్లుగా కమిషన్ పనిచేయడం లేదని తెలిపారు. ఇద్దరు సభ్యుల పదవీ కాల పరిమితి 2015 ఆగస్టుతో ముగిసిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఛైర్‌పర్సన్‌ జస్టిస్ ఎన్‌.ఏ.కక్రూ 2016 డిసెంబర్లో పదవీ విరమణ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. మూడు నెలల్లో కమిషన్​ను తిరిగి ఏర్పాటు చేస్తామని సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కమిషన్‌ ఏర్పాటుకు నాలుగు నెలల గడువిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి:

ఆ జీవో రద్దు కోసం... పోరాటానికి సిద్ధం: చంద్రబాబు

sample description
Last Updated : Oct 31, 2019, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.