ETV Bharat / city

'రాజధానిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..?'

author img

By

Published : Nov 28, 2019, 11:38 AM IST

అమరావతి పర్యటనలో.. తన కాన్వాయ్​పై జరిగిన రాళ్ల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. రాజధానిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. అని అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు.

chandrababu fires
chandrababu fires

జాతీయ మీడియాతో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు

వైకాపా పరిపాలన, ఆ పార్టీ శ్రేణుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాజధాని అమరావతి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. తన కాన్వాయ్​పై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వడాన్ని ఖండించారు. వైకాపా నేతలు రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానిని పట్టించుకోకపోవడం దారుణమన్న చంద్రబాబు... ప్రశ్నించినవారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాజధానిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గుర్తు చేశారు. అమరావతిని పట్టించుకోకపోవడం ఆంధ్రా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడమే అన్నారు. ఎంతో త్యాగం చేసి రైతులు భూములు ఇస్తే... వారిని అవమానపరుస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు రావాలంటేనే భయపడే పరిస్థితి మంచిది కాదని హితవు పలికారు.

ఇదీ చూడండి:

చంద్రబాబు కాన్వాయ్​పై రాళ్లు.. అమరావతి పర్యటనలో ఉద్రిక్తత

Intro:Body:

''రాజధానిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?''



వైకాపా పరిపాలన, ఆ పార్టీ శ్రేణుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాజధాని అమరావతి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. తన కాన్వాయ్ పై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వడాన్ని ఖండించారు. వైకాపా నేతలు రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానిని పట్టించుకోకపోవడం దారుణమన్న చంద్రబాబు... ప్రశ్నించినవారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాజధానిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గుర్తు చేశారు. అమరావతిని పట్టించుకోకపోవడం ఆంధ్రా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడమే అన్నారు. ఎంతో త్యాగం చేసి రైతులు భూములు ఇస్తే... వారిని అవమానపరుస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు రావాలంటేనే భయపడే పరిస్థితి మంచిది కాదని హితవు పలికారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.