ETV Bharat / state

పోలింగ్‌ సిబ్బందికి ఎలాంటి ఆహారం పెడతారో మీకు తెలుసా - పూర్తి మెనూ ఇదే - Food Menu Of Polling Officers

author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 10:50 PM IST

Food Menu of Polling Officers : రాష్ట్రంలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ విధులు నిర్వహించే అధికారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. వేసవి కాలం కావడంతో ముఖ్యంగా ఆహారం విషయంలో రాజీపడకుండా, నాణ్యత గల భోజనం అందించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. వారికందించే ఆహార మెనూ ఏంటంటే?

Food Menu of Polling Officers
Lok Sabha Elections 2024 (ETV Bharat)

Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో పోషకాలతో కూడిన భోజనం తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది, ఉద్యోగులకు నాణ్యమైన సమతుల ఆహారం అందించాలని సంబంధిత అధికారులను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. సోమవారం జరగబోయే పోలింగ్‌ కోసం ఇప్పటికే ఓటింగ్‌ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. వారికి రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య భోజనం (అన్నం, కూర, చపాతీ, చట్నీ, పప్పు, టమాటా పెరుగు) అందిస్తారు.

పోలింగ్‌ రోజు సోమవారం ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8 నుంచి 9 గంటల మధ్య టమాటా, క్యారెట్‌తో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ అందిస్తారు. 11 నుంచి 12 గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం (కోడిగుడ్డు కూర, సాంబారు, ఓ కూరగాయ, చట్నీ, పెరుగు) అందిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు. 5.30 గంటలకు టీ, బిస్కెట్లు అందించనున్నారు. ఈ ప్రక్రియ గ్రామాల్లో పంచాయతీ అధికారుల, పురపాలికల్లో ప్రత్యేకంగా నియామకమైన వారు పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఫ్యాన్లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

పోలింగ్​ సిబ్బంది మెనూ ఇదే

సమయంఆహారం
ఆదివారం రాత్రి 7 నుంచి 8 గంటలకు భోజనం (అన్నం, కూర, చపాతీ, చట్నీ, పప్పు, టమాటా పెరుగు)
సోమవారం ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు
ఉదయం 8 నుంచి 9 గంటలకుటమాటా, క్యారెట్‌తో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ
ఉదయం 11 నుంచి 12 గంటలకు మజ్జిగ
మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం (కోడిగుడ్డు కూర, సాంబారు, ఓ కూరగాయ, చట్నీ, పెరుగు)
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం
సాయంత్రం 5.30 గంటలకు టీ, బిస్కెట్లు

నీ ఓటు నాయకులనే కాదు - దేశ భవిష్యత్తునూ మారుస్తుంది - ఒక్క ఓటే కదా అనే నిర్లక్ష్యం వద్దు! - Importance of vote in ELECTIONS

మీ ఓటర్‌ స్లిప్‌ను ఆన్​లైన్​లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి - How to Download Voter Slip Online

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.