ETV Bharat / state

ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి నేతలు- టీడీపీలోకి భారీగా చేరికలు - Election Campaign Alliance leaders

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 8:52 AM IST

Alliance leaders Election Campaign And YCP Leaders Join TDP: రాష్ట్రంలో అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. పలు నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. ప్రచార అభ్యర్థులకు పూలతో ఘనస్వాగతం పలుకుతున్నారు.

Alliance leaders Election Campaign And YCP Leaders Join TDP
Alliance leaders Election Campaign And YCP Leaders Join TDP

ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి నేతలు- టీడీపీలోకి భారీగా కొనసాగుతున్న చేరికలు

Alliance Leaders Election Campaign And YCP Leaders Join TDP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. పలు నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించి కూటమి అధికారంలో రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.

ఏ ముఖం పెట్టుకుని వచ్చారు - వైఎస్సార్సీపీ నేతలను నిలదీసిన మహిళలు - Women Questioned YSRCP Leader

విజయవాడ శివారు గొల్లపూడిలో మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమలో వైసీపీ సీనియర్‌ నేత సోమినాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ రూరల్ మండలం పి.నైనవరం గ్రామానికి చెందిన విజయ్‌సాగర్ వాలంటీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి 40 కుటుంబాలతో కలిసి టీడీపీలో చేరారు. గన్నవరం ఎన్డీయే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో కోడూరు, మొవ్వ మండలాలకు చెందిన 120 మంది వైసీపీ నేతలు జనసేనలో చేరారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలువులు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

రాష్ట్రాభివృద్ధి కోసం బాబును గెలిపిద్దాం- జోరుగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో అన్నవరం నుంచి చిప్పాడ వరకు టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. మజ్జివలస గ్రామంలో వైసీపీ నేతలు పెద్దఎత్తున గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 8 పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ప్రముఖ హాస్యనటుడు జబర్దస్త్‌ ఆది జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామంలో పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎన్డీయే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. జి. సిగడాం మండలం దేవరవలసలో వైసీపీ నేత శ్రీనివాసనంద సరస్వతి 5 వందల కుటుంబాలతో కలిసి ఈశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు.

రాష్ట్రంలో జోరుగా కూటమి నేతల ప్రచారాలు- భారీగా కొనసాగుతున్న చేరికలు

విజయనగరం జిల్లా రాజాం ఎన్డీయే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ రాజయ్యపేటలో జయహో బీసీ కార్యక్రమం చేపట్టగా 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన పట్టణంలోని పలు వార్డులో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట అభ్యర్థి బండారు సత్యానందరావు రావులపాలెం మండలం గోపాలపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంపచోడవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డి తరఫున ఆయన కుమార్తె కైవల్యారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చిత్తూరు అభ్యర్థి గురజాల జగన్మోహన్ కట్టమంచిలోని మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థి టి.జి.భరత్ జోరుగా ప్రచారం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మినారాయణ, కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కంబదూరు మండలంలో పెద్దఎత్తున రోడ్‌షో నిర్వహించారు.

'టీడీపీతోనే గ్రామస్వరాజ్యం సాధ్యం'- ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన పయ్యావుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.