ETV Bharat / sports

'ఆ ఫార్ములాతో మూడోసారి విజేతగా SRH!' ఎంఎస్కే ప్రసాద్​తో ఈటీవీ భారత్​ ఎక్స్​క్లూజివ్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 10:36 PM IST

MSK Prasad Interview ETV Bharat: బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ 2024 ఐపీఎల్​ గురించి ఈటీవీ భారత్​తో ముచ్చటించారు. 2024 ఐపీఎల్​లో సన్​రైజర్ హైదరాబాద్ విజయావకాశాల గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

MSK Prasad Interview ETV Bharat
MSK Prasad Interview ETV Bharat

MSK Prasad Interview ETV Bharat

MSK Prasad Interview ETV Bharat: 2024 ఐపీఎల్​ కోసం బ్రాడ్​కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్​ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 7) హైదరాబాద్​లోని ఓ కాలేజీలో ప్రమోషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్​కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ (MSK Prasad), మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్​ఎస్​కే ప్రసాద్ ఈటీవీ భారత్​తో మాట్లాడారు. రానున్న ఐపీఎల్​ సీజన్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలతోపాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈటీవీ భారత్​తో షేర్ చేసుకున్నారు.

ఐపీఎల్ 2024లో సన్​రైజర్స్ హైదరాబాద్​ ఛాంపియన్​గా నిలుస్తుందని ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. హైదరాబాద్​ జట్టుకు గతంలో రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్లు ఆస్ట్రేలియాకే చెందినవాళ్లని గుర్తుచేశారు. 'వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్​ ప్యాట్ కమిన్స్​ను సన్​రైజర్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్​లో ఎస్​ఆర్​హెచ్​కు కమిన్సే నాయకత్వం వహించే ఛాన్స్ ఉంది. ఇక ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్, వానిందు హసరంగ రాకతో జట్టు స్ట్రాంగ్​గా ఉంది. కచ్చితంగా ఈసారి జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఇక గతంలోనూ హైదరాబాద్​కు ఆస్ట్రేలియన్ ప్లేయర్లు ఆడమ్ గిల్​క్రిస్ట్, డేవిడ్ వార్నర్ టైటిళ్లు అందించారు. ఈసారి కమిన్స్ సన్​రైజర్స్​కు​ కెప్టెన్​ అవుతాడనుకుంటున్నా. కమిన్స్ నాయకత్వంలో హైదరాబాద్ కప్పు గెలవాలి అని ఆశిద్దాం' అని అన్నారు.

ఇక ఐపీఎల్​ ద్వారా ఎందరో మంది యువ ఆటగాళ్లకు అనేక అవకాశాలు వస్తున్నాయని ఎమ్​ఎస్​కే అన్నారు. ప్రస్తుతం టీమ్ఇండియాలో రాణిస్తున్న యశస్వి జైశ్వాల్, శుభ్​మన్ గిల్, రింకూ సింగ్, ముకేశ్ కుమార్ లాంటి ప్లేయర్లంతా అలా జాతీయ జట్టులోకి వచ్చిన వాళ్లేనని పేర్కొన్నారు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచాన్ని ఐపీఎల్​ శాసిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నేనూ విరాట్ అభిమానినే: కోహ్లీ ఈ సీజన్​లో ఎలా అడే ఛాన్స్ ఉంది? అన్న ప్రశ్నకు, 'నేను కూడా విరాట్​ అభిమానినే' అని ఎమ్​ఎస్​కే రిప్లై ఇచ్చారు. 'కోహ్లీ ఏ సీజన్ ఆడలేదో చెప్పండి. కోహ్లీ అన్ని సీజన్​లు బాగా ఆడాడు. కోహ్లీ అంటే కోహ్లీయే. 2016 సీజన్​లో 973 పరుగులు చేసి విరాట్ ఓ రికార్డు క్రియేట్ చేశాడు. అది నా భూతో నా భవిష్యత్. నాకు తెలిసి ఆ రికార్డు బ్రేక్ చేయడం చాలా కష్టం. ప్రతీ సీజన్​లో విరాట్ 100కి 200 శాతం కమిట్​మెంట్​తో ఆడతాడు. కానీ, వాళ్లకు ఏదో కలిసిరావట్లేదు. కప్పు గెలవలేకపోతున్నారు. అందరిలాగే విరాట్​కు నేనూ పెద్ద ఫ్యాన్. ఈసారి వాళ్లు కూడా బాగా ఆడాలని ఆశిద్దాం' అని ఈటీవీ భారత్​తో అన్నారు.

Ishan Kishan Parents Interview : 'అతడితో ఇషాన్​ను పోల్చొద్దు.. ఏ ప్లేస్​లోనైనా ఆడగలడు'

'SRHలో ఉండడం చాలా హ్యాపీ- నా కెరీర్​లో ఇది కొత్త ఫేజ్'- ఈటీవీ భారత్​తో జయదేవ్ ఉనద్కత్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.