ETV Bharat / sports

సురేఖ, అభిషేక్ జోడీ అదుర్స్- 'భారత్' ఖాతాలో మూడు పసిడి పతకాలు - Archery World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 10:27 AM IST

Updated : Apr 27, 2024, 3:38 PM IST

Archery World Cup 2024
Archery World Cup 2024

Archery World Cup 2024: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. శనివారం జరిగిన ఫైనల్స్​లో ఆయా విభాగాల్లో విజయం సాధించి మూడూ స్వర్ణాలు భారత్ ఖాతాలో వెశారు.

Archery World Cup 2024 : ఆర్చరీ ప్రపంచకప్ 2024లో భారత ఆర్చర్లు తమ సత్తా చాటారు. తాజాగా జరిగిన ఫైనల్స్​లో పోటాపోటీగా ఆడి భారత్​కు మూడు స్వర్ణ పతకాలు అందించారు. శనివారం జరిగిన కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో వరల్డ్​కప్ స్టేజ్- 1 ఫైనల్​లో భారత మహిళల టీమ్ జ్యోతి సురేఖ, అదితి స్వామి, ప్రర్​ణీత్ కౌర్​లతో కూడిన జట్టు ప్రత్యర్థి ఇటలీ టీమ్​పై 236-225 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ పట్టేశారు.

ముఖ్యంగా తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఈ ఫైనల్​లో తనదైన శైలిలో ఆడి సత్తా చాటింది. మిక్స్‌డ్‌ డబుల్‌ ఈవెంట్ మహిళా జట్టు స్వర్ణాలు గెలవడంలో జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించింది.

ఇక కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సురేఖ- అభిషేక్‌ వర్మ జోడీ ఫైనల్‌లో 158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై గెలుపు సాధించింది. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్‌, ప్రథమేశ్‌తో కూడిన ఇండియన్​ టీమ్​ నెదర్లాండ్‌కు చెందిన మైక్‌ స్కాలోసెర్, సిల్ పటెర్, స్టెఫ్‌ విలిమ్స్ టీమ్‌పై 238-231 తేడాతో అలవోకగా చిత్తు చేశారు. దీంతో స్వర్ణం ఆ జట్టు సొంతమైంది.

ఇదిలా ఉండగా, మహిళల జట్టు విభాగంలో ఇటలీకి చెందిన టీమ్‌పై మన భారత్ అమ్మాయిలు అద్భుత విజయాన్ని సాధించారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫైనల్స్​లో స్వర్ణం సాధించారు. వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌తో కూడిన ఈ టీమ్‌ఇండియా జట్టు 236-225 తేడాతో ఇటలీ ఆర్చర్లు మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్​ను చిత్తు చేసి ఘన విజయాన్ని సాధించడం విశేషం. దీంతో ఇటలీ ప్లేయర్లు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది.

మరోవైపు రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో అంకిత బాకత్‌- బొమ్మదేవర ధీరజ్‌ జోడీ మెక్సికతో తలపడనుంది. మరో విశేషం ఏంటంటే మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి సెమీ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Archery World Cup 2023 : ఆర్చరీలో పసిడి ధమాకా.. స్వర్ణాన్ని ముద్దాడిన తెలుగు తేజాలు!

వరల్డ్‌ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్‌ 2023లో శ్రీకాకుళం క్రీడాకారుల హవా - బంగారు, కాంస్య పతకాలు కైవసం

Last Updated :Apr 27, 2024, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.