ETV Bharat / spiritual

ఆ రాశి వారి పెండింగ్ పనులన్నీ ఈరోజు క్లియర్- ఆదిత్య హృదయం చదవండి! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 4:04 AM IST

Horoscope Today May 16th 2024 : మే​ 16న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today May 16th 2024 : మే​ 16న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తివ్యాపార రంగాల వారికి అన్ని విధాలా పురోగతి ఉంటుంది. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. గతంలో వాయిదా పడిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మేలు జరుగుతుంది.


.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ప్రభావవంతంగా ఉంటుంది. సృజనాత్మకత, పోటీతత్వంతో సమర్ధవంతంగా పనిచేసి అందరి మెప్పును పొందుతారు. మీ సామర్ధ్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తిస్తారు. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో అంచనా వేయడం కష్టం అవుతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉంది. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్ధికంగా సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్ గురించి చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఇందువలన సమయం వృధా కాదు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయంలో వృద్ధి ఉండదు. ఉద్యోగులకు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. మెరుగైన ఫలితాల కోసం గణపతి ప్రార్ధన చేయండి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు వేగవంతంగా, ముందుచూపుతో ఉంటాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. దూకుడుతో తీసుకునే నిర్ణయాల వలన నష్టం రావచ్చు. వృత్తి నిపుణులు చేసే పని పట్ల శ్రద్ధ చూపించాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి సామాన్యంగా ఉంటుంది. గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకుంటారు. కుటుంబం విలువేంటో గ్రహిస్తారు. ఎన్నో రోజులుగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు. మీ వాస్తవిక ధోరణి కారణంగా జీవితంలో చాలా విషయాలు తెలుసుకుంటారు. ప్రత్యర్థులు ఉంటేనే నిజమైన పురోగతి సాధిస్తామనే మాటను నమ్ముతారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన చేస్తే మేలు జరుగుతుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంతర్గతంగా మీలోని శక్తిని వెలికి తీసి బంగారు భవిష్యత్ కు పునాదులు వేసుకుంటారు. ఎన్నో రకాల అవకాశాలు ఈ రోజు మీ ఇంటి తలుపు తడతాయి. దైవబలం అండగా ఉంటుంది. మనోనిబ్బరంతో పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తే కార్య సిద్ధి ఉంటుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వదంతులను దూరంగా పెట్టండి. మీ వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం సహించకండి. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు దూరప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచన ఉంది. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి లోపిస్తుంది. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి గణపతిని ప్రార్ధిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. న్యాయవివాదంలో తీర్పు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఆర్థికపరంగా నష్టాలు సంభవిస్తాయి. ఫైనాన్స్, కమిషన్ వ్యాపారస్తులకు నష్టాలు భారీ స్థాయిలో ఉండవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణంలో చోరభయం ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగుతాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో పనిచేసి అఖండ విజయాలను అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. ఆర్ధికంగా ఊహించని లాభాలను అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉండాలంటే తెలివితేటలూ ఒక్కటే సరిపోవు లౌక్యంగా కూడా కావాలి అని గ్రహిస్తారు. సృజనాత్మకంగా వ్యవహరించండి. కొత్త మార్గాలను అన్వేషించండి. ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. జీతం పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారులు సరైన పెట్టుబడిదారుల కోసం అన్వేషించండి. లలితా సహస్రనామ పారాయణ చేస్తే మేలు జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.