ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: రాప్తాడులో చంద్రబాబు - CHANDRABABU PRAJAGALAM

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 2:18 PM IST

chandrababu_fire_on_jagan

Chandrababu announced Mega DSC : రాయలసీమ ద్రోహి జగన్‌ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అన్న చంద్రబాబు రాష్ట్రం భవిష్యత్ కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పని అయిపోయిందని, ఇక 46 రోజులే మిగిలి ఉందని చెప్తూ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే అని పేర్కొన్నారు.

Chandrababu announced Mega DSC : మరో 46 రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాప్తాడు ప్రజాగళంలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే అని ప్రజలకు తెలిపారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, రాష్ట్రం భవిష్యత్‌ కోసం మూడు పార్టీలు కలిశాయని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమకు మద్దతివ్వాలని చంద్రబాబు కోరారు. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతిఒక్కరూ ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

రావణాసురుడి పాలనకు అంతం పలకాల్సిన సమయం వచ్చింది: చంద్రబాబు - Madanapalle Praja Galam meeting

అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, జగన్‌ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు అన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్‌ లూటీ చేశారని, విద్యుత్‌ ఛార్జీలను అమాంతం పెంచేశారని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నింటి ధరలను పెంచుకుంటూ పోయిన జగన్​ ప్రభుత్వాన్ని దించేయాలని, అసమర్థుడు, అవినీతిపరుడిని ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పేదలను నిరుపేదలుగా మార్చిన పెత్తందారు జగన్‌- బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం: చంద్రబాబు - chandrababu election campaign

జగన్​ ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచేసిందని, నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితి నెలకొందని చంద్రబాబు తెలిపారు. నాసిరకం మద్యం తాగి ఎంతోమంది చనిపోయారని చెప్పారు. ఆఖరికి ఇసుకపైనా దోపిడీ చేశారని, భవన నిర్మాణ కార్మికులను వీధిన పడేశారని మండిపడ్డారు. స్థానిక అవసరాలకు ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైందని తెలిపారు. రాప్తాడులో ఇసుక దొరకదు కానీ, ఇక్కడి ఇసుక బెంగళూరులో దొరుకుతుందని ధ్వజమెత్తారు.

టీడీపీ ఎన్నికల ప్రచారం షురూ - నేటి నుంచి ప్రజల్లోకి చంద్రబాబు - Chandrababu Election Campaign

నిరుద్యోగులను నిలువునా ముంచేశారని చంద్రబాబు తెలిపారు. జగన్​ ఐదేళ్ల పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. రాయలసీమకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెడితే జగన్‌ ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రాయలసీమకు రాజకీయ హింస తెచ్చిన జగన్​ రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ మాఫియా, సైకో రాజ్యంగా మార్చేశారని, పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని తెలిపారు. గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత మాది అని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని చెప్పారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, సబ్‌ప్లాన్‌ తీసుకొస్తామని వెల్లడించారు.

కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్‍: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.