ETV Bharat / international

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు- 10మంది నేవీ సిబ్బంది మృతి- విన్యాసాలు చేస్తుండగా! - Malaysia Helicopter Crash

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 10:34 AM IST

Updated : Apr 23, 2024, 11:14 AM IST

Malaysia Helicopter Crash
Malaysia Helicopter Crash

Malaysia Helicopter Crash : సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది సిబ్బంది మరణించారు. ఈ ఘటన మలేసియాలో జరిగింది.

Malaysia Helicopter Crash : మలేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొనడం వల్ల 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం శిక్షణ విన్యాసాల కోసం గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభిస్తామని మలేసియా నౌకదళం పేర్కొంది.

'AW139 మారిటైమ్ ఆపరేషన్ హెలికాప్టర్​లో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. దీనిని ఇటాలియన్ డిఫెన్స్ కాంట్రాక్టర్ లియోనార్డో అనుబంధ సంస్థ అగస్టా వెస్ట్ ల్యాండ్ తయారు చేసింది. మరోకటి యూరోపియన్ మల్టినేషన్ డిఫెన్స్ ఎయిర్ బస్​ తయారు చేసిన ఫెన్నెక్​ తేలికపాటి విమానంలో మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. రెండు హెలికాప్టర్​లో ఉన్న సిబ్బంది మొత్తం మరణించారు. సిబ్బందిని గుర్తించేందుకు వారి అవశేషాలను ఆస్పత్రికి తరలించాం' అని నౌకదళం తెలిపింది.

Last Updated :Apr 23, 2024, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.