ETV Bharat / international

కొండచరియలు విరిగిపడి 15మంది మృతి- 60మంది గల్లంతు - Landslide Accident In Congo

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 7:14 AM IST

Updated : Apr 15, 2024, 8:44 AM IST

Congo Landslide Accident Today
Congo Landslide Accident Today

Landslide Accident In Congo : కాంగో దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటం వల్ల 15 మంది మరణించారు. 60 మంది వరకు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.

Landslide Accident In Congo : భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడిల దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 60మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నైరుతి కాంగోలోని ఇడియోఫా పట్టణంలో ఉన్న ఓడరేవు సమీపంలో శనివారం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో ఏడుగురిని ప్రాణాలతో కాపాడగలిగారు. అయితే గల్లంతైనవారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్​ను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

'ప్రమాదంలో గల్లంతైన వారిని కనుగొనేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశాం. సహాయక చర్యల్లో ఏడుగురిని ప్రాణాలతో రక్షించగలిగాం. వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆస్పత్రికి తరలించాం. ఇంకా 60మంది ఆచూకీ తెలియాల్సి ఉంది' అని ప్రావిన్షియల్​ తాత్కాలిక గవర్నర్​ ఫెలిసియన్​ కివే తెలిపారు.

'ఓడరేవు సమీపంలో ఒక పెద్దకొండ ఉంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఇక ఘటన జరిగిన ప్రాంతంలో ప్రతి శనివారం మార్కెట్​ జరుగుతుంది. మత్స్యకారులు చేపలు, ఇతర నిత్యవసరాలు అమ్ముకోవడానికి ఇక్కడకు వస్తుంటారు. అయితే మార్కెట్​కు అధిక సంఖ్యలో ప్రజలు రావడం వల్ల ఎంతమంది గల్లంతయ్యారో అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేము' అని స్థానిక అధికారి ధేధే ముపాసా చెప్పారు.

ట్రక్కును ఢీకొన్న బస్సు- 18 మంది మృతి
ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగో రాజధాని కిన్షాసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎన్‌డిజిలి ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుకు వెళ్తున్న సమయంలో మలుపు తిరగడానికి ప్రయత్నించిన బస్సు, ఓ ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సంబంధిత శాఖల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హార్ముజ్​లో ఓడపై ఇరాన్ దాడి - నౌకలో 17 మంది భారతీయులు - Iran Attack On Ship In Hormuz

మాల్​లో కత్తితో కస్టమర్స్​పై దాడి- చిన్నారి సహా ఆరుగురు మృతి- పోలీసుల చేతిలో నిందితుడి హతం - Australia Mall Attack

Last Updated :Apr 15, 2024, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.