ETV Bharat / health

రోజూ ఉదయం బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఎన్ని లాభాలో తెలుసా? వెయిట్ లాస్ పక్కా! - Black Coffee Benefits

author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 9:32 AM IST

Black Coffee Health Benefits
Black Coffee Health Benefits (Source : Getty Images)

Black Coffee Health Benefits : రోజూ ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉందా? అందులోనూ బ్లాక్ కాఫీ తాగడమంటే మరీ ఇష్టమా? అయితే మీరు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Black Coffee Health Benefits : కప్పు కాఫీతో రోజుని ప్రారంభించే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా బ్లాక్ కాఫీని తాగేందుకు మరీ ఆసక్తి చూపిస్తుంటారు ఎంతో మంది. బ్లాక్ కాఫీ కేవలం మంచి సువాసన, రుచి కలిగి ఉంటుంది అనుకుంటే మీకు దాని గురించి ఏమీ తెలియనట్టే. ఎందుకంటే బ్లాక్ కాఫీ కేవలం మిమ్మల్ని ఆకర్షించేందుకు మాత్రమే కాదు మిమ్మల్ని రిలాక్స్ చేసేందుకు చాలా బాగా సహాయపడుతుందట. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అభిజ్ఞా పనితీరును మెరుగుపరిచేందుకు, మెదుడు సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ఇవే కాకుండారోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీని మిస్ అవకుండా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. అవేంటో వాటి వివరాలేంటో తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు:
బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్, మోలనోయిడిన్స్ వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్​ను తటస్థం చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తాయి. రోజూ ఉదయాన్నే కప్పు బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అంది వ్యాధులతో పోరాడే శక్తి మెరుగవుతుంది.

కాంగ్నిటివ్ ఫంక్షన్:
మానసిక ప్రశాంతత కావాలనుకునే వారికి బ్లాక్ కాఫీ మంచి డ్రింక్. ఇందులోని కెఫైన్ మెదడుకు సహజమైన రిలాక్సేషన్ అందిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అడినోసౌన్ న్యూరోట్సాన్సిమిటర్​ను అడ్డుకుని, డొపడైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ వంటి ఫీల్ గుడ్ న్యూనోట్రాన్సిమిటర్లను విడుదల చేస్తుంది. ఇవి మీ మూడ్​ను మరింత ఉత్సాహంగా మార్చేందుకు, ఫోకస్ పెంచి మెదడును మరింత చురుగ్గా మార్చేందుకు సహాపడతాయి.

శారీరక పనితీరు:
మీరు వర్కౌట్స్ చేయడానికి వెళుతున్నా లేదా రోజంతా బిజీబిజీగా గడపాల్సి ఉన్నా బ్లాక్ కాఫీ తాగి వెళ్లడం మంచిది. ఇది మీ శారీరక పనితీరుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇందులోని కెఫైన్ రక్తంలో అడ్రినాలిన్ స్థాయిలును పెంచుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలోని కొవ్వు కణజాలాల నుండి ఫ్యాటీ యాసిడ్లను సమీకరించి శరీరానికి కావాల్సిన శక్తి వినియోగానికి సహాయపడుతుంది. కాబట్టి రోజూ వ్యాయామం చేసేవారు ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగి బయలు దేరడం వల్ల కొన్ని ఎక్కవ కేలరీలను తగ్గించుకోగలుగుతారు.

బరువు నియంత్రణ:
ఈరోజుల్లో పదిలో ఏడుగురు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారే ఉన్నారు. అలంటి వారికి బ్లాక్ కాఫీ మంచి వెయిట్ లాస్ సీక్రెట్​గా పనిచేస్తుంది. కాఫీలోని కెఫైన్ మీ జీవక్రియను పెంచడమే కాకుండా రోజంతా ఎక్కువ కేలరీలు కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మీ డైట్ ప్లాన్​కు తగ్గట్టుగా సహజమైన ఆకలిని అణిచివేసి అదనపు కేలరీలకు దూరంగా ఉంచుంది. ఫలితంగా మీరు సమతుల్య ఆహారం తీసుకుని బరువును నియంత్రణలో ఉంచుకోగలుగుతారు.

కాలేయ ఆరోగ్యం:
కాలేయం శరీర నిర్విషీకరణకు, పోషకాలతో నిండిన జీవక్రియకు సహాయపడుతుంది. కాబట్టి దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. రోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి కాలేయ వ్యాధులకు దూరంగా ఉండచ్చని కొన్ని పరిశోధనల్లో తెలుస్తుంది. వాస్తవానికి కాఫీ తాగని వారితో పోల్చి చూస్తే క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల్లో కాలేయ వ్యాధి ప్రమాదాలు 80శాతం వరకూ తక్కువగా ఉంటున్నాయని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో చాలా సహాయపడతాయని స్పష్టంగా చెబుతున్నారు నిపుణులు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

స్మోక్​ చేస్తున్నారా? ఓవర్ వెయిట్ పెరగడం గ్యారెంటీ- అర్జెంట్​గా మానేయండి! - Smoking Increases Belly Fat

సరిగ్గా నిద్రపోకపోతే కంటి ఆరోగ్యం షెడ్డుకే? ఇవి పాటిస్తే బిగ్​ రిలీఫ్! - Impact Of Sleep On Eye Health

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.