అవసరమైతే అగ్నిపథ్​​ స్కీమ్​ను మారుస్తాం: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ - Rajanth Singh On Agnipath Scheme

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 2:46 PM IST

Updated : Mar 28, 2024, 3:00 PM IST

Rajnath Singh Announcement On Agniveer Scheme

Rajanth Singh On Agnipath Scheme : అగ్నిపథ్​​ స్కీమ్​కు సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ మంత్రి కీలక ప్రకటన చేశారు. అవసరమైతే ఈ పథకాన్ని మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

Rajanth Singh On Agnipath Scheme : ప్రస్తుతం అమలవుతున్న అగ్నిపథ్​ లేదా అగ్నివీర్​​ రిక్రూట్​మెంట్​ స్కీమ్​లో అవసరమైతే మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టం చేశారు. గురువారం టైమ్స్​ నౌ సమ్మిట్​లో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అగ్నివీరుల భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి హామీ ఇచ్చారు.

రక్షణ దళాల్లో యువతరం ప్రాధాన్యాన్ని వివరించిన మంత్రి అగ్నివీర్​ పథకాన్ని మరోమారు సమర్థించారు. సేనా మే యూత్‌ఫుల్‌నెస్​ హోనీ చాహియే (సైన్యంలో యువత ఉండాలి) అని అన్నారు. 'దీని పట్ల ప్రస్తుత యువతరం ఉత్సాహంగా ఉందని నేను భావిస్తున్నా. వీరంతా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారని నమ్ముతున్నా. ఈ పథకం (అగ్నివీర్)లో భాగంగా వీరి భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేందుకు మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని మార్పులు చేసేందుకు కూడా కట్టుబడి ఉన్నాం' అని రాజ్​నాథ్​ స్పష్టం చేశారు.

Agnipath Scheme : త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2022 జూన్​లో 'అగ్నిపథ్‌' పథకాన్ని ప్రకటించింది. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. నాలుగేళ్లు మాత్రమే సర్వీస్‌ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు సిద్ధం అవుతున్న పలువురు యువకులు మండిపడ్డారు.

ఈ పథకం కింద నియమితులైన యువతీయువకులను అగ్నివీరులుగా పిలుస్తారు. వీరు 4 సంవత్సరాల పాటు సర్వీసులో ఉంటారు. ఇందులోనే 6 నెలల శిక్షణా కాలంతో పాటు 3.5 ఏళ్ల ఉద్యోగం ఉంటుంది. నాలుగు ఏళ్ల తర్వాత సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత సాయుధ దళాల్లోనే కొనసాగేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి (అగ్నివీరులకు) ఉంటుంది.

'ఇంజిన్​ల ఎగుమతిదారుగా భారత్​!'
మరోవైపు 'ఆత్మనిర్భర్ భారత్' అంశంపైనా ఈ సమ్మిట్​లో మాట్లాడారు రాజ్​నాథ్​. ఇంజిన్​లను ఎగుమతి చేసే దేశంగా భారత్​ను తీర్చిదిద్దాలని చూస్తున్నామని అన్నారు.

"దేశాన్ని ఇంజిన్‌లను ఎగుమతి చేసే దేశంగా మార్చాలనుకుంటున్నాము. ఇందుకోసం భారత్​లో ఎలాంటి ఇంజిన్‌లను తయారు చేయవచ్చో, ఇందుకు కావాల్సిన సాంకేతికతను పంచుకోవడానికి ఏ దేశాలు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించమని నేను డీఆర్​డీఓను కోరాను. ఈ ఇంజిన్​లన్నీ భారతీయుల ద్వారానే తయారు చేయిస్తాం."
- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

అలాగే భారత్​ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి స్పందించారు. మన దేశ సరిహద్దులను ఎవరూ ఆక్రమించుకోలేదు. అవి పూర్తి సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఈడీ కోర్టుకు కేజ్రీవాల్​- లిక్కర్​ స్కామ్​పై కీలక సమాచారం రివీల్! - Kejriwal ED Custody Live Updates

సీఎం ఇంట సంతోషాల పండుగ- ఆడపిల్లకు జన్మనిచ్చిన భగవంత్ మాన్ భార్య - Punjab Cm New Born Baby

Last Updated :Mar 28, 2024, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.